మత్య్సకారులకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అడుగడుగునా అన్యాయం చేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 8 ఫిషింగ్ హార్బర్లు, 4 జెట్టీలు కడతామన్నారని, కానీ ఇప్పటివరకు ఒక్కటి కూడా ఎందుకు నిర్మించలేదని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. వందల బోట్లు, వేలాదిమంది మత్స్యకారులు ఉన్న జిల్లాలో మినీ హార్బర్ నిర్మాణం జరపడంలేదు.. కానీ రుషికొండలో మాత్రం రూ. 500 కోట్లతో విలాసవంతమై భవనం కట్టుకుంటున్నారని విమర్శించారు. జగన్ రెడ్డి తన సలహాదారుల కోసం చేసే ఖర్చులో సగం కూడా మత్య్సకారులకు ఖర్చు చేయడం లేదని దుయ్యబట్టారు. మినీ హార్బర్ నిర్మాణం జగన్ హయాంలో పేపర్లకే పరిమితమైందన్నారు. ప్రాణాలకు తెగించి సముద్రంపై చేపల వేట సాగించే వారికి జెట్టీ చేపల వేట ఆధారంగా జీవిస్తున్న మత్స్యకారులను సముద్రానికి దూరం చేస్తారా? అని ప్రశ్నించారు. ఉవ్వెత్తున ఎగసిపడే అలల్ని సునాయాసంగా ఎదుర్కొనే మత్సకారులు.. వైసీపీ ప్రభుత్వ అకృత్యాలకు బలవుతున్నారని అనగాని సత్య ప్రసాద్ అన్నారు.