లోకాయుక్త చొరవతో కారుణ్య నియామకాల జీవోలో మార్పు జరిగింది. అవివాహితుడైన ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే ఆ కుటుంబంలో అక్క, చెల్లి, అన్న, తమ్ముడు కారుణ్య నియామకానికి అర్హులుగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. గతంలో చనిపోయిన ఉద్యోగి కంటే చిన్న వాళ్లే అర్హులంటూ ప్రభుత్వం జీవోలో పేర్కొంది. అయితే లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ రెడ్డి చొరవతో అక్క, అన్న కూడా అర్హులు అంటూ జీవోలో మార్పు చేసింది. 2021లో ఫిర్యాదు చేయడంతో లోకాయుక్త ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపింది. విశాఖ జిల్లాలో చనిపోయిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మహేష్ కేసులో లోకాయుక్త చిరవ చూపింది. దీంతో మహేష్ అన్న అప్పలరాజుకు ప్రభుత్వం కారుణ్య నియామకం ఉత్తర్వులు జారీ చేసింది.