ఇటీవల భారీ వర్షాలు చెన్నై నగరాన్ని అతలాకుతలం చేయగా ప్రస్తుతం దక్షిణ తమిళనాడును ముంచెత్తుతున్నాయి. ఈ మేరకు తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, టెన్కాశి జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది. దీంతో ప్రభుత్వం ఈ జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలతో పాటు బ్యాంకులు, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటించింది. అలాగే అధికారులు సిబ్బందిని ముందస్తుగా అప్రమత్తం చేస్తున్నారు.