నిజాంపట్నం జడ్పిటిసి సభ్యుడు నర్రా సుబ్బయ్య జడ్పిటిసి సభ్యత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎంపీ మోపిదేవి ప్రధాన అనుచరుడుగా పేరుందిన నర్రా సుబ్బయ్య
వైసీపీకి రాజీనామా చేసి రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సమక్షంలో సోమవారం టిడిపిలో చేరారు. సుబ్బయ్య భార్య 2014 నుండి 19 వరకు నిజాంపట్నం ఎంపీపీగా కొనసాగారు. నియోజకవర్గ ఇన్చార్జిలు మార్పు తర్వాత అధికారికంగా ఇదే తొలి రాజీనామా.