గుంటూరు జిల్లాలో 32 పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు సీసీఐ గుంటూరు డీజీఎం స్వప్నిల్ ధర్మన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
నాణ్యత వారీగా ఎంఎస్పీ ధరలు, పత్తి సేకరణ కేంద్రం తదితర వివరాలు తెలుసుకునేందుకు సీసీఐ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. పత్తి రైతులంతా తమ వివరాలను సమీపంలోని కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని కోరారు.