రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ నాటికి నిల్వ కేంద్రాలకు కందిపప్పు తరలించనుంది. కేజీ రూ.67 చొప్పున అందించనుంది.
ఇప్పటికే పలు జిల్లాల్లో అమలు చేస్తుండగా.. జనవరి నుంచి అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయిలో అమలు చేయనుంది. తొలిసారిగా రాష్ట్రంలో పండిన కందులను రైతుల నుంచి కొనుగోలు చేసి, సరఫరా చేయనుంది.