సభ ద్వారానే టీడీపీ, జనసేన మేనిఫెస్టోను ప్రకటించనున్నామని తెదేపా నేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లాలో యువగళం విజయోత్సవ సభ ఏర్పాట్లను టీడీపీ నేతలు పరిశీలించారు.
ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో యువత నిర్వీర్యమైందన్నారు. యువతకు ఆర్థిక స్థోమత, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థను జగన్ నాశనం చేశారని మండిపడ్డారు.