ధర్మవరంలో శ్రీ బాల రాముని విగ్రహ రథయాత్రను మంగళవారం ప్రారంభించారు. పట్టణంలోని పలు వీధులు ఎర్రగుంట సర్కిల్ నందు ప్రారంబించి ఆర్టీసీ బస్టాండ్, కళాశాల సర్కిల్, కళాజ్యోతి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, గాంధీ నగర్, మాధవనగర్ మీదుగా శివనగర్‌లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నందు వైభవంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ బలరాముని విగ్రహాన్ని దర్శించుకున్నారు.