తిరుమల శ్రీవారిని మంత్రి రోజా దర్శించుకున్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని శ్రీవారిని కోరుకున్నట్లు మంత్రి రోజా తెలిపారు. ఎల్లోమీడియా దిగజారుడు రాజకీయాలు చేస్తుందని మంత్రి మండిపడ్డారు. మిషన్ 2024లో 175కు 175 స్థానాలు సాధిస్తామని రోజా ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు దొరకడం లేదన్నారు. నాకు సీటు ఇవ్వకపోయినా సీఎం వైయస్ జగన్ వెంటే ఉంటానని మంత్రి రోజా స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో రోజాకు టిక్కెట్టు రాదని కోంత మంది శునకానందంతో చేస్తున్న ప్రచారం మాత్రమే అని మంత్రి రోజా తెలిపారు. గడప గడపకు మొదలుకోని అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో ముందు వరుసలో నేనే ఉంటున్నాను అన్నారు. రాబోయే ఎన్నికలలో తప్పకూండా పోటి చేస్తాను.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కే సీట్లు లేకుండా రోండేసీ నియోజకవర్గాలలో సర్వే చెయ్యించుకుంటున్నారు.. నేను జగనన్న సైనికురాలుని.. ఆయన మాటే నాకు శిరోధార్యం అంటూ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. పార్టీ కోసం కష్టపడే వారికి సీటు తప్పకుండా వస్తుంది అని ఆమె అన్నారు. తాము మంత్రులం ఒకే నియోజకవర్గంలో ఉండలేం.. కదా, రెండు మూడు చోట్ల ప్రభావితం చేసే స్థితిలో ఉన్నామని రోజా అన్నారు. నగరి నియోజకవర్గానికి చాలా చేసాను అని మంత్రి ఆర్కే రోజా తెలిపారు. ఆ సీటు విషయంలో గ్యారంటీగా ఆ టికెట్ నాకే వస్తుంది అందులో సందేహం లేదని రోజా పేర్కొన్నారు.