పెనగలూరు మండలం కొండూరు హరిజన వాడ కోలి రమణయ్య మేక మంగళవారం 4 పిల్లలకు జన్మనిచ్చింది. ఒకదాని తర్వాత ఒకటి 15 -20 నిమిషాల్లోనే 4 పిల్లలు పుట్టాయని రమణయ్య తెలిపారు. ఇతనికి మొత్తం 15 మేకలు వున్నాయి. ఈ రైతు మందలో మేకలు సాధారణంగా 2-3 పిల్లలను కనటం మామూలేనట. కానీ ఈ సారి ఏకంగా 4 పిల్లలకు జనమ్నిచ్చినట్లు రైతు రమణయ్య తెలిపారు. మేకలు మా పేదల పాలిట నల్ల బంగారం అంటూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa