మైదుకూరు పట్టణంలో ఎనిమిదవ రోజు అంగన్వాడి వర్కర్స్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద జరుగుతున్న వంటావార్పు కార్యక్రమానికి మంగళవారం ఏఐటీయూసీ అనుబంధ సంఘాలైన ఏ. పీ. మున్సిపల్ వర్కర్స్ యూనియన్, ఏ. పీ. ఆటో వర్కర్స్ యూనియన్, భవన నిర్మాణ సంఘం, రైతు సంఘాల నాయకులు మద్దతును ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి శ్రీరాములు, ఏఐటియూసి నియోజకవర్గ కార్యదర్శి శివరామ్ తదితరులు పాల్గొన్నారు.