ఓబులవారి పల్లి మండలం బోటిమీద పల్లి అరుందతి వాడకు స్మశానం స్థలం సమస్యపై తహశీల్దార్ కార్యాలయంలో ఎన్నోసార్లు వినతిపత్రాన్ని ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. మంగళవారం ఆ గ్రామంలో ఒకరు అనారోగ్యం కారణంగా మరణించగా స్మశానం కోసం గ్రామస్తులు వైసిపి మండల కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డిని స్మశానం ఏర్పాటు గురించి సంప్రదించారు. వెంటనే స్పందించి రెవెన్యూ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపారు.