రాష్ట్రంలో ప్రభుత్వ భూములు, రోడ్డు స్థలాలు లాంటివి సైతం భూ కబ్జా దారులు వదలటం లేదు. వివరాల్లోకి వెళ్ళితే... గుంటూరు జిల్లా, నల్లపాడు పరిధిలోని MBTS గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ఎదురు, సత్తెనపల్లి నుండి గుంటూరు వెళ్లు రహదారిలో రోడ్డు పరిధిలో ఉన్న స్థలాన్ని స్థానికులు ఆక్రమించుకోవడం వలన పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఇబ్బంది పాలౌతున్నాయి. కళాశాల విద్యార్ధులకి సంభందించి బస్సులు ఎక్కడానికి దిగడానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన స్థలాన్ని(డివైడర్) సైతం కొందరు స్థానికులు ఆక్రమణ చేసుకొని విద్యార్ధులకి ఇబ్బంధికరమైన వాతావరణం సృష్టిస్తున్నారు. దీనితో గత ఆరు నెలల కాలంలో ఎన్ని రోడ్డు ప్రమాదాలు సంభవించి విద్యార్థులు ఇబ్బందులకు గురౌతున్నారు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ని జరుగుతున్నప్పటికీ స్థానిక అధికారులు స్పందించకపోవడంపై స్థానికంగా ఉంటున్న కుటుంబాలు విస్మయమౌతున్నాయి. ఇప్పటికైనా స్థానిక అధికారులు స్పందించి కళాశాల విద్యార్ధులకి తోడుగా ఉండాలని స్థానికంగా నివాసం ఉంటున్న కుటుంబాలు కోరుకుంటున్నాయి. రాత్రి సమయంలో ఆక్రమించుకొని కట్టిన కిరాణా కొట్ల ముందు మందు బాబులు త్రాగి స్థానికంగా ఇబ్బందులకు గురి చెయ్యడం వలన యువత అలానే స్థానికంగా నివాసం ఉండే కుటుంబాలు భయబ్రాంతులకు గురౌతున్నారు. వెంకట్ హెయిర్ సెలూన్, పర్హాన్ మినీ ఫుడ్ కోర్ట్, అమ్మ మెస్ అండ్ కర్రీస్ పాయింట్, excellent టీ స్టాల్ అండ్ బేకరీ, లక్కీ ట్యూషన్ అంటూ ప్రభుత్వ రహదారులని సైతం వదలకుండా కొందరు ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఇప్పడికైనా జిల్లా అధికారులు స్పందించి , భవిషత్తుకి బాటలు వెయ్యవలసిన విద్యార్ధులకి అండగా నిలబడి స్థానిక సమస్యని పరిష్కరించాలని స్థానికంగా నివాసం ఉంటున్న కుటుంబాలు ఆవేదన చెందుతున్నారు.