యాడికి మండల కేంద్రంలో మంగళ వారం యువనాయకులు కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. యాడికి గ్రామానికి చెందిన ఇద్దరికి మంజూరైన 1. 29 లక్షల రూపాయల సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ను అందచేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు, బాల రమేష్ బాబు, బ్రహ్మానందరెడ్డి, కాసా చంద్రమోహన్, తదితరులు పాల్గొన్నారు.