ఉరవకొండ పట్టణంలోని స్థానిక కరిబసవస్వామి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాల గురించి సెబ్ సీఐ మారుతీరావు, హెచ్ఎం వీరన్న వివరించారు. వాటి జోలికి వెళ్లొద్దని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అంతే కాకుండా బాల్య వివాహాలు చేయడం వల్ల బాలికలకు చిన్నప్పుడే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని సెబ్ సీఐ మారుతీరావు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa