ఉరవకొండ పట్టణంలోని అయ్యన్ హనుమాన్ ఎరువుల దుకాణంలో విజిలెన్స్ సీఐ వెంకటరమణ, ఏవో వాసుప్రకాశ్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం మంగళవారం దాడులు చేపట్టింది. రూ. 1. 05 లక్షల విలువైన ఎరువులకు అనుమతులు లేవని, వాటి అమ్మకాన్ని నిలుపుదలకు ఆదేశించారు. రూ. 89, 802 విలువైన 6. 3 మెట్రిక్ టన్నుల ఎరువును జప్తు చేసినట్లు తెలిపారు. అనుమతులు లేకుండా మందులు, ఎరువులను విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు.