కంబదూరు మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం ఆర్డిఓ రాణి సుస్మిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో తహసీల్దార్ కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం భూముల సమస్యలపై వచ్చిన వారితో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ఇళ్ల నిర్మాణం పై ఉన్న సమస్యల గురించి తహసీల్దార్ తో అడిగి తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలని తెలిపారు.