ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో సబ్ కలెక్టర్ గా పనిచేస్తున్న సేతు మాధవన్ ఎంఈ ఎమ్ఎస్ కార్పొరేషన్ సీఈఓ గా బదిలీ చేస్తూ మంగళవారం ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మార్కాపురం సబ్ కలెక్టర్ గా రాహుల్ మీనా ను నియమించారు. ఆయన త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. మార్కాపురం సబ్ కలెక్టర్ గా సేతు మాధవన్ సమర్థవంతంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందారని పలువురు కొనియాడారు.