పొన్నలూరు మండలంలో ఎక్కడైనా పేకాట, కోడి పందాలు వంటి జూదాలు నిర్వహిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని స్ధానిక ఎస్సై సాంబశివయ్య హెచ్చరించారు. పొన్నలూరులోని పోలీస్ స్టేషన్లో మంగళవారం ఎస్సై మాట్లాడుతూ ఇటీవల తమకు సమాచారం అందిన మేరకు పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకుని న్యాయస్థానం ముందు హాజరు పరిచామన్నారు. జూదాలపై పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందని ఎస్సై హెచ్చరించారు.