ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గొట్లగట్టు గ్రామంలో మండల పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సైదా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైదా మాట్లాడుతూ కరుణామయుడు ఏసుక్రీస్తు ప్రబోధించిన కరుణా దయ శాంతి త్యాగనిరతితో ప్రజలు జీవించాలని అన్నారు.