వెలిగండ్ల మండల కేంద్రంలోని స్థానిక మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు, ఆయాలు మంగళవారం వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. గత వారం రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలను పరిష్కరించాలని నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వెలిగండ్ల సిఐటియు నాయకులు రావెళ్ల మాలకొండయ్య మాట్లాడుతూ అంగన్వాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.