జిల్లాలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో జరిగిన పంట నష్టాన్ని పక్కాగా నమోదు చేయాలని మంగళవారం రాయచోటి కలెక్టరేట్ లోని స్పందన హాల్లో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో చాలా వరకు అరటి, వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయని, దెబ్బతిన్న పంటల వివరాలు పక్కాగా నమోదు చేయాలన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం ఆoదేలా చూడాలన్నారు.