జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు ‘యువగళం- నవశకం’ సభలో పాల్గొననున్నారు. అయితే, నిన్న రాత్రి నుంచి ఆయన జ్వరం కారణంగా స్వల్ప అస్వస్థతతో ఉండడంతో సభకు కొంచెం ఆలస్యంగా చేరుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కొందరూ అస్వస్థత కారణంగా పవన్ కళ్యాణ్ సభకు హాజరు కాకపోవచ్చనే ఊహగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ తరచూ అస్వస్థతకు గురవుతుండటం గమనార్హం.
ఓవైపు సినిమా షూటింగులు, రాజకీయ సభలు, సమావేశాలతో బిజీగా ఉండటంతో పవన్ అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. ఇటీవలే పవన్ అస్వస్థతకు గురి కావడంతో ఓ సభ, సినిమా షూటింగ్ కూడా వాయిదా పడినట్టు సమాచారం. అదేవిధంగా గతంలో పవన్ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో.. నందమూరి తారకరత్నకు నివాళులు అర్పించేందుకు వెళ్లలేదని కూడా గతంలో వార్తలు వినిపించాయి. ఇవాళ జరిగే యువగళం-నవశకం సభకు పవన్ హాజరు అవుతున్నారు. కానీ కాస్త ఆలస్యంగా వెళ్లనున్నట్టు సమాచారం.