రైతు భరోసాకు అర్హులైన లబ్ధి పొందని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని నాగులప్పలపాడు వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. అర్హులైన రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని, రైతు భరోసా కేంద్రాలను సంప్రదించి ఈనెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కౌలు దారులైతే సాగుహక్కు పత్రం, ఆధార్ సంబంధిత పట్టా పత్రాలు సమర్పించాలని కోరారు.