తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఏడాదిన్నర చిన్నారిని ఓ తల్లి హతమార్చింది. ఆ తర్వాత చిన్నారి శవాన్ని నదిలో పారేసింది. ఈ ఘటన కర్ణాటకలోని చెన్నపట్టణంలో జరిగింది.
కాలికెరె గ్రామానికి చెందిన భాగ్య (21)కు ఏడాదిన్నర చిన్నారి ఉంది. గర్భం ధరించినప్పటి నుంచి భర్త శ్రీనివాస్‌కు దూరంగా ఉంటూ భాగ్య పుట్టింట్లోనే ఉంటోంది. అయితే స్థానిక యువకుడితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. దానికోసం ఆమె తన బిడ్డను చంపుకుంది.