అక్రమాస్తుల కేసులో తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కె.పొన్ముడికి మద్రాస్ హైకోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఇదే కేసులో రూ.50 లక్షల జరిమానా సైతం విధించింది. 2006 నుంచి 2011 వరకూ మంత్రిగా ఉన్న పొన్ముడి రూ.1.36 కోట్లు అక్రమాస్తులను కూటబెట్టారనే కేసులో పొన్ముడితో పాటు ఆయన భార్య విశాలాక్షిని మద్రాస్ హైకోర్టు ఈనెల 19న దోషిగా తేల్చింది. గురువారం తీర్పు వెలువరించిన న్యాయమూర్తి పొన్ముడికి మూడేళ్ల జైలు శిక్ష విధించారు.