శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనంకు శనివారం నుంచి జనవరి 1 వరకు అనుమతివ్వనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
విష్ణునివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్ పల్లిలోని జెడ్పీ హైస్కూల్ లో టోకెన్లు జారీ చేయనున్నారు.