మోసపు వాగ్దానాలతో వైఎస్ జగన్ ప్రజలను దగాచేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఐదేళ్లు చాలలేదనడం దిగజారుడుతనానికి పరాకాష్ట అని తెలిపారు. సరైన సమయంలోనే ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపుతారన్నారు. రాష్ట్రాన్ని ఆర్థిక సుడిగుండంలోకి నెట్టిన జగన్ హామీల అమలులోనూ విఫలమయ్యారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని దేవినేని ఉమ పేర్కొన్నారు.