శ్రీకాకుళం జిల్లా, మెళియాపుట్టి, చాపర గ్రామానికి చెందిన ఐదేళ్లు చిన్నారి హసినిని కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు గురువారం ఇందుకు సంబంధించిన పాతపట్నం సీఐ వినోద్‌బాబు వెల్లడించారు. బుధవారం వీధిలో హసిని అడుకుం టుండగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవానంపై వచ్చి కిడ్నాప్ చేసినట్టు ఆమె తల్లి నాగమ్మ ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి, సీసీ ఫుటేజీల ఆధారంగా ఆ ఇద్దరు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు పాతపట్నానికి చెందిన సవర కృష్టారావు కాగా మరొకరు ఒడిశా రాష్ట్రం కాశీనగర్‌కు చెంది చల్లా శంకరరావుగా పోలీసులు గుర్తించారు. ఆ చిన్నారిని ఆమె తల్లి నాగమ్మకు అప్పగించి, నిందితులిద్దరిని టెక్కలి కోర్టులో హాజరుపరిచినట్టు ఏఎస్ఐ నర్సింగరావు తెలిపారు. పాత తగదాలు నేపథ్యంలో కిడ్నాప్ జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి వాస్తవాలు బయటకు రానున్నట్టు స్పష్టం చేశారు.