పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపిలపై సస్పెన్షన్ ఎత్తివేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఆ మేరకు శుక్రవారం గుంతకల్లు పట్టణంలోని పొట్టి శ్రీరాములు కూడలిలో సిపిఎం నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు డి. శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి బి. శ్రీనివాసులు మాట్లాడుతూ పార్లమెంటులో జరిగిన దాడిపై చర్చించాలని కోరిన ఎంపిలను సస్పెండ్ చేయడం సరైంది కాదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa