ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో వ్యవసాయ ఎగుమతులు పెద్దగా పెరిగే అవకాశం కనిపిచడం లేదు. గత ఆర్థిక సంవత్సరం సాధారణ స్థాయిలోనే 5,400 కోట్ల డాలర్లకు (సుమారు రూ.4,41,331 కోట్లు) చేరే అవకాశం ఉందని
కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ తెలిపారు. గోధుమలు, బాస్మతియేతర బియ్యం ఎగుమతులను నిషేధించడం, చక్కెర ఎగుమతులపై ఆంక్షలు విధించడం ఇందుకు కారణమన్నారు.