ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్షణలోని అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని నిరవధిక సమ్మె 4వ రోజుకు చేరుకుంది. ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద శనివారం నిరసన చేపట్టారు. కళ్ళకు గంతలు కట్టుకొని, చెవిలో పూలతో నిరసన తెలిపారు. ఉద్యమానికి మద్దతుగా వివిధ ఉపాధ్యాయ, కార్మిక విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. చర్చి సెంటర్ వద్ద ఉద్యోగులు మానవహారం గా వారి నిరసనను తెలిపారు.