వంగవీటి మోహన రంగా 35వ వర్ధంతి. ఈ సందర్భంగా విజయవాడ బందరు రోడ్డులో ఉన్న రంగా విగ్రహానికి పూలమాల వేసి రంగా కుమార్తె ఆశ, రాధా భార్య పుష్పవల్లి నివాళి అర్పించారు. వంగవీటి రంగ వర్ధంతి కార్యక్రమంలో రంగా కుమార్తె ఆశా, రాధా భార్య పుష్పవల్లి పేర్కొన్నారు. రంగా వర్ధంతికి రాధా తొలిసారి హాజరు కాలేకపోయారు. దీనికి కూడా కారణం లేకపోలేదు. వంగవీటి రాధా తన తండ్రి రంగా తర్పణం వదిలేందుకు కాశీ వెళ్లారు. ఆ కారణంగానే రాధా వర్ధంతి కార్యక్రమానికి దూరంగా ఉన్నారని అనుచరులు చెబుతున్నారు. వంగవీటి రాధా కాశీలో రంగా వర్థంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు వంగవీటి ఆశ. రంగా అభిమానులంతా తమ కుటుంబ సభ్యులేనన్నారు. వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు రంగా వర్ధంతి కాబట్టి.. రాజకీయాలు మాట్లాడడం సరికాదన్నారు ఆశ. వంగవీటి రాధా తన తండ్రి మోహన రంగా వర్ధంతి, జయంతి కార్యక్రమాలకు కచ్చితంగా హాజరవుతూ వస్తున్నారు. కానీ ఈ ఏడాది మాత్రం అందుబాటులో లేకుండా పోయారు.. కాశీ వెళ్లిన కారణంగానే ఆయన దూరంగా ఉన్నారంటున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వంగవీటి మోహన రంగా వర్దంతి సందర్భంగా అభిమానులు భారీ ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.