వచ్చే ఏడాది రష్యాలో పర్యటించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ఆహ్వానించారు. రష్యాలో ఐదు రోజుల అధికారిక పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి (ఈఏఎం) ఎస్ జైశంకర్‌తో సమావేశమైన సందర్భంగా రష్యా అధ్యక్షుడు ప్రధాని మోదీని ఆహ్వానించారు.విదేశాంగ మంత్రి, అంతకుముందు రష్యా కౌంటర్ సెర్గీ లావ్రోవ్తో సమావేశమయ్యారు.