కనగానపల్లి మండలం ఏలుకుంట్లకు చెందిన శివయ్య (28) అనే యువకుడు బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు. శివయ్య బుధవారం రాత్రి కనగానపల్లి నుండి ఏలుకుంట్లకు వస్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన ఓ కారు ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయినట్లు తెలిపారు. ఈ ఘటనపై కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa