అయోధ్యలో జనవరి 22 న జరిగే రామ మందిర ప్రారంభోత్సవానికి ముందే అక్కడ నూతనంగా నిర్మించిన విమానాశ్రయం వాడుకలోకి రానుంది. అయితే ఈ విమానశ్రయాన్ని డిసెంబర్ 30న ప్రారంభించనున్నారు. దీనికి ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్యధామ్’గా నామకరణం చేశారు. ఈ విమానాశ్రయానికి రామాయణ పురాణ రచయితగా ప్రసిద్ధి చెందిన పురాణ కవి వాల్మీకి పేరు పెట్టారు. ఈ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.