జగనన్న విద్యాదీవెన పథకం కింద 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు రూ.584 కోట్లు జమ చేయనుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇవాళ జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి ఈ మొత్తాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు.