సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధిక పెట్రో ధరల నుంచి ప్రజానీకానికి ఉపశమనం కల్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు రూ.6–10 తగ్గించే దిశంగా మోదీ సర్కార్ అడుగులు వేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినా ఆ మేరకు రిటైల్ అమ్మకం ధరలను చమురు కంపెనీలు తగ్గించలేదు.