చోరీ కేసులో వ్యక్తికి 5 సంవత్సరాల 8 నెలలు జైలుశిక్ష, రూ.19 వేలు జరిమానా విధిస్తూ పెద్దాపురం జ్యూడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ తీర్పు చెప్పినట్లు గండేపల్లి పోలీసులు తెలిపారు. 2018లో మండలంలోని జెడ్.రాగంపేట గ్రామ శివారులో ఆంధ్రాబ్యాంక్ పక్కన ఇంట్లో అద్దెకు ఉంటున్న వివాహిత నీలం అనసూయను శృంగరాయపాలెం గ్రామానికి చెందిన బెజ్జపు అనురుద్ బాబా చాకుతో బెదిరించి మెడలో ఉన్న బంగారు మంగళసూత్రం తీసుకోవడంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై అప్పటి ఎస్ఐ కేసు నమోదు చేయగా సీఐ వై.రాంబాబు దర్యాప్తు జరిపించారని, కేసు వాదోపవాదాలు అనంతరం నేరం రుజువు కావడంతో శిక్ష విధించారని గండేపల్లి పోలీసులు తెలిపారు.