పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తిపై గెలిచాననుకున్నానని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తెలిపారు. అయన మాట్లాడుతూ.... అప్పట్లో చెగువేరా, మదర్ థెరిసాలాంటి వ్యక్తుల ఫోటోలు పవన్ కళ్యాణ్ పెట్టుకున్నారన్నారు. ఇప్పుడు ఆ ఫోటోలు తీసేసి, చంద్రబాబు ఫోటో పెట్టుకుని యువతను మోసం చేశాడన్నారు. చంద్రబాబు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలకు ఈ దత్తపుత్రుడు ఏ విధంగా సహకరిస్తున్నాడో తెలుసుకోవాలని గ్రంధి శ్రీనివాస్ అన్నారు. కారంచేడు దళితులపై దాడి, వంగవీటి రంగాను హత్య చేయించిన చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.