విజయనగరం జిల్లా, రేగిడి మండలంలో సంకిలి గ్రామంలో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి ఉంగరాడమెట్ట నుంచి అక్రమంగా ఎనిమిది మద్యం సీసాలను తరలిస్తుండగా పట్టుబడినట్లు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మద్యం బెల్ట్‌షాపులు నిర్వహించినా, పరిమితికి మించి వ్యక్తుల వద్ద మద్యం బోటిళ్లు దొరికినా చట్టపరమైన చర్యలు తప్ప వని ఎస్ఐ హెచ్చరించారు.