ఆర్జీవీ దర్శకత్వంలో రూపొందిన ‘వ్యూహం’ సినిమాపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ... వ్యూహానికి ప్రతి వ్యూహం ఉంటుంది కదా..? అని అన్నారు. ఎన్నికల ముందు ఈ తరహా సినిమాలు తీయడం ఓ ఫ్యాషన్ అయిందని.. ఇలాంటి సినిమాలకు సీఎం జగనే డబ్బులు పంచుతున్నారని విమర్శించారు. ఆర్జీవీ తరపున కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నది వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డని, ఆ అడ్వకేట్లను చూస్తేనే ఆ సినిమా ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చన్నారు. న్యాయపరంగా తమకున్న హక్కుల కోసం పోరాడుతున్నామని, నిజంగా సినిమా తీయాలంటే హు కిల్డ్ బాబాయ్, కోడి కత్తి, ప్యాలెస్సులో జరుగుతున్న అవినీతి మీద తీయొచ్చుకదా అని నారా లోకేష్ అన్నారు.