జయహో బీసీ పేరిట జనవరి 4న తెలుగుదేశం పార్టీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించే వర్క్ షాప్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో క్షేత్ర స్థాయికి వెళతామన్నారు. క్షేత్ర స్థాయి చైతన్య కార్యక్రమాల తర్వాత జయహో బీసీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని నారా లోకేష్ అన్నారు. బీసీలకు రక్షణ చట్టం పేరిట మినీ మేనిఫెస్టోలో ఇప్పటికే ప్రాధాన్యం కల్పించామన్నారు. బీసీలకు శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందచేస్తామన్నారు. బీసీ ఉప కులాల కోసం ప్రత్యేకంగా నిధి ఏర్పాటు చేసి వారికే ఖర్చు చేస్తామని నారా లోకేష్ అన్నారు.