రేపు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న సందర్భంగా పునరుద్ధరించిన అయోధ్య రైల్వే స్టేషన్‌ను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం పరిశీలించారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా స్టేషన్‌ను నిర్మించామన్నారు. "ప్రధాని నరేంద్ర మోడీ విజన్ ప్రకారం, అయోధ్యలో రైల్వే స్టేషన్ మరియు ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు. అయోధ్య ధామ్ స్టేషన్ మన దేశ సంస్కృతి మరియు సంప్రదాయం ప్రకారం నిర్మించబడింది. ఇది మన ప్రధాని యొక్క విజన్" అని అశ్విని చెప్పారు. రైల్వేస్టేషన్ పునరుద్ధరణలో చాలా కొత్తదనం ఉందన్నారు. స్టేషన్ హోల్డింగ్ ఏరియా చాలా విశాలంగా ఉందని, అక్కడ 100 అడుగుల రూఫ్ ప్లాజా నిర్మించామని మంత్రి తెలిపారు. డిసెంబర్ 30న అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.