గోద్రా రైలు దహనం, తదనంతర గుజరాత్ అల్లర్ల కేసుల్లో సాక్షులుగా ఉన్న 95 మంది వ్యక్తులకు కల్పించిన భద్రతను సుప్రీంకోర్టు నియమిత ప్రత్యేక దర్యాప్తు బృందానికి(సిట్) చెందిన సాక్షుల పరిరక్షణ విభాగం సిఫార్సులతో రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
ఆయా కేసులను విచారించిన మాజీ జడ్జీ, వాదనలు వినిపించిన న్యాయవాదులకు సీఐఎస్‌ఎఫ్ ద్వారా ఏర్పాటు చేసిన భద్రతను కూడా సిట్ తొలగించిందని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.