2019లో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టో, పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు కాలేదు, సంక్షేమం పేరు బటన్ నొక్కడం.. బూటకపు మాటలు చెప్పడం మాత్రమే మిగిలిందని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ 730 హామీలు ఇచ్చారని.. 21 పూర్తిగా అమలు చేశారని, 88 పాక్షికంగా అమలు చేశారన్నారు. 621 హామీల అమలే చేయలేదన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఏ దిశగా అడుగులు వేస్తున్నారో తెలియడం లేదని అన్నారు. 85 శాతం హామీల అమలు చేయలేదని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి ఢిల్లి వెళ్ళి మోదీకి సలాం చేస్తున్నారన్నారు. అమరావతిని స్మశానంలా మార్చేశారని మండిపడ్డారు. విశాఖ పరిపాలన రాజధాని అని చెప్పి ఒక్క పని కూడా చేయలేదన్నారు. పోలవరం ప్రాజెక్టును గాలికి వదిలేసారన్నారు. వైసీపీ మునుగుతున్న పడవ అంటూ గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేశారు.