రాష్ట్రంలోని పెన్షనర్లకు సోమవారం నుంచి రూ.3వేల పెన్షన్ రానుంది. జనవరి 1 నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక రూ.3వేలకు పెంచనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
మొత్తం 66.34 లక్షల మందికి పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏటా రూ.23,556 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ నెల 3న కాకినాడలో పెంచిన పింఛన్ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించనున్నారు. కొత్తగా అర్హులైన 1,17,161 మందికి పెన్షన్ కార్డులను పంపిణీ చేయనున్నారు.