దేశంలో అత్యధిక నీటి నిల్వ సామర్థ్యం గల జలాశయాలున్న నదుల్లో కృష్ణానది అగ్రగామిగా నిలిచింది. కేంద్ర జలసంఘం లెక్కల ప్రకారం దేశంలోని అన్ని నదీపరివాహక ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయిన జలాశయాల నీటినిల్వ సామర్థ్యం 9,105 టీఎంసీలు. ఇందులో 1788 టీఎంసీల సామర్థ్యంతో కృష్ణా నది టాప్ లో ఉండగా తెలుగు రాష్ట్రాల వాటానే 589 టీఎంసీలు కావడం గమనార్హం. 2వ స్థానంలో గంగ (1718 టీఎంసీలు), 3వ స్థానంలో గోదావరి(1237 టీఎంసీలు) నదులున్నాయి.