ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేజ్రీవాల్‌ కీలక వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Mon, Jan 01, 2024, 01:17 PM

ప్రజా శేయస్సు కోసం తాము ఎంచుకున్న మార్గంలో జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉండాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలతో జరిగిన వర్చువల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు.
అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములుగా చేయడంతో తమ పార్టీ ప్రజాదరణ పొందిందని కేజ్రీవాల్‌ అన్నారు. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న పార్టీ నేతలను చూసి గర్వంగా ఉందన్నారు. ''పిల్లలకు ఉన్నతమైన విద్య, పేదలకు ఉచిత వైద్యం గురించి మాట్లాడితే మనం జైలుకు వెళ్లాల్సిందే. అందుకు మనం సిద్ధంగా ఉండాలి. మనం సమస్యలను ఎదుర్కొంటున్నామని భావిస్తున్నా. కానీ, అందుకు బాధపడనవసరం లేదు. ఈ రోజు జైలులో ఉన్న మన నేతలే మన హీరోలు. వారందరినీ చూసి చాలా గర్వపడుతున్నా'' అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com