కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సీబీఐ మరోసారి నోటీసులు జారీచేసింది. కేరళకు చెందిన జైహింద్ టీవీ ఛానెల్‌లో పెట్టుబడులకు సంబంధించిన వివరాలు అందించాలంటూ శివకుమార్, ఆయన భార్య ఉషతో పాటు 30 మందికి నోటీసులు జారీ చేసింది.
ఈ కేసుకు సంబంధించి జనవరి 11న తమ ఢిల్లీ కార్యాలయంలో హాజరుకావాలని సూచించింది. సీఆర్‌పీసీ సెక్షన్ 91 ప్రకారం ఈ నోటీసును ఇచ్చింది.